SPIRIT BEHIND GOSEVA

శ్రీ గురుభ్యోనమః శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర గో సేవ సత్సంగ్ ట్రస్ట్ గుడివాడ లో ఉన్న గోవులన్నీ కూడాను 2012 సంవత్సరం మే ఒకటో తారీకు న ద్వారక తిరుమలలో జరుగుతున్న ఒక గోవులమేళా అందు అమ్మకాల్లో కొంతమంది భక్తులు ఒక గోవుని గుడివాడలో శ్రీ గురువుగారికి సమర్పించాలని అనుకున్నప్పుడు గురువుగారు వారి అభ్యర్థన మేరకు ద్వారకాతిరుమల వెళ్లడం జరిగింది. ఆ క్రమంలో గురువుగారు గోవుల్ని చూసి శ్రీ ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి ప్రయాణమై వచ్చే సమయంలో స్వామివారి ఆదేశం మేరకు మళ్ళీ ఇంకొకసారి గోవులవద్దకు వాటిని అమ్ముతున్న ప్రదేశానికి వెళ్లవలసిందిగా శ్రీవేంకటేశ్వరస్వామివారి నుండి వచ్చిన ఆదేశం ప్రకారం గురువుగారు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో విక్రయదారులు మిగిలిన గోవులన్నింటిని వాళ్లు కబాలా వాళ్ళకి అమ్మివేసి వెళ్లిపోదామని అనుకుంటున్న సందర్భంలో స్వామివారి నుండి వచ్చిన ఆదేశానుసారంగా ఆ గోవులన్నీ శ్రీ గురువుగారు చెప్పగా ఆప్రకారం శ్రీ ఉమాపతి గారు వాటికి తగిన మూల్యాన్ని చెల్లించి ఆ గోవులన్నింటిని మే 2 తారీఖున 2012 లో గుడివాడ తీసుకురావడం జరిగింది. అప్పటినుండి ఈ గోవులన్నీ కూడాను రామన్నపూడి గోశాల యందు శ్రీ కామాక్షి అమ్మవారికి చెందిన గోవులు గా పర్యవేక్షింపబడుచున్నాయి. దానికి గాను ఎంతోమంది అమ్మవారి భక్తులైన దాతలు ఈ పది సంవత్సరములుగా ఈ గోవుల్ని సేవించుకుంటున్నారు.

The Sage Word

మహర్షులు అనేక కోట్ల మైళ్ళ దూరాన్ని చూడగలిగే వాళ్ళు గోవు ధర్మస్వరూపము గావో రక్షతి రక్షితః మానవుడు మనోవాక్కాయ ఇంద్రియముల ద్వారా నిర్దేశింపబడుతూ మంచి మార్గంలో సంపాదించిన ధనమును లేక ద్రవ్యమును పంచమాతృక విధానంలో 1. భూమాత 2.గోమాత 3.వనమాత 4.నాదీమాత మరియు 5.వేదమాతల సంరక్షణకు వినియోగించాలి. The SageWord means ఒక Spiritual energy నిండిన మహనీయుని మాట… ఇందులో అందరూ సేవకులే.
గోవు ధర్మ స్వరూపము.

గోమాత ధర్మ స్వరూపం

గోవు ప్రతి మానవునికి తల్లి మరియు తండ్రి. గోవు ప్రతి మానవుని ఎల్లవేళల రక్షిస్తుంది. దేవదానవులు చేసిన సాగర మధనంలో మొట్టమొదటిగా కామధేనువు ఉద్భవించినది. ఈరోజు మన దగ్గర ఉన్న ఈ గోజాతులన్నీ కూడా ఆకామధేనువు యొక్క సంతానమే.

లక్ష్మీదేవి ఎల్లవేళలా గోమయ్యము నందు నివసిస్తానని తెలియజేసింది.
అందుకే మన ముంగిట్లో ధనుర్మాసమందు అందరూ గొబ్బెమ్మలను మహాలక్ష్మికి ప్రతిరూపంగా ఏర్పాటుచేసి పూజిస్తారు. గోమయము లక్ష్మి స్వరూపము. ఎన్ని రోజులు నిలవవున్నా గోమయం నందు దుర్వాసన రాదు.
అసుచి గల ప్రదేశములు మరల శుద్ధి చేసుకోవడానికి అన్నిచోట్ల పవిత్రతను చేకూర్చటానికి గోమయం ఉపయోగపడుతుంది. గోవు గిట్టలులలో అన్ని తీర్థాలు ఉంటాయి.

గోవుకి ప్రతిదినము గ్రాసం పెట్టిన వాళ్ళకు గోలోక ప్రాప్తి కలుగుతుంది అని తెలియజేయబడింది. ఈ ప్రపంచంలో అత్యున్నత స్థానం గోవుది.

ఈ ప్రపంచం అంతటిలోనూ గోవుతో సమతూగగలిగిన ప్రాణి ఇంకొకటి లేదు.
గోమాత మాత్రమే అత్యున్నతమైన ప్రాణి. ఈ ప్రపంచంలో ఎప్పటికీ గోమాతకి సమానంగా సమస్తాయిగా ఉండగలిగిన జీవరాసి ఇంకొకటి లేదు. బ్రహ్మదేవుడు, వశిష్ట మహాముని వంటి వారు కూడా ఒక గోవుని ఎంచగలిగిన వాళ్ళు కానీ, దాని యొక్క విలువకట్టగలిగే వారు కానీ, ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని తెలియజేశారు. గోసేవ చేసేవారికి ,వాటిని అమ్మ వారి స్వరూపంగా పూజించే
వారికి వైతరిణి నదిని దాటి వెళ్లే అర్హత కలుగుతుంది అని గరుడ పురాణంలో స్వయంగా తెలియజేయబడింది.

ప్రస్తుతము మన శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర గోశాల రామన్నపూడి యందు శ్రీ పరమాచార్య స్వామి వారి ఆదేశానుసారం గోసంరక్షణ లో భాగంగా సుమారుగా 20 రకాల గోవులు కలవు.

వాటిల్లో మన భారతదేశం నందు అన్ని ప్రాంతాలలో లభించే అన్ని ప్రముఖమైన సుమారు 20 జాతులకు పైగా గోవులు సంరక్షింపబడుతున్నాయి.
వాటిలో ప్రముఖ జాతులైన

1.ఒంగోలు
2.మైసూరు
3.మలినాడు
4. పుంగనూరు
5.నాటు
6.మోటు
7.అలికేరి
8.హాలండ్
9.జెర్సీ
10.సింధి
11.కార్ పార్కర్
12.మధుర
13.కేన్స్
14.కాగ్నిస్

మొదలైన ప్రముఖమైన జాతుల గోవులన్నీ కూడా భద్రపరిచి వాటి యొక్క సంతానాన్ని ముందుతరాల వాళ్లకు కూడా అందించే విధంగా సంరక్షింపబడుతున్నాయి.

image
image
image
image
image
image
image
image
image